రాష్ట్ర భాజపా పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణను పోలీసులు ఇంటి వద్ద అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురు జిల్లా నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ ఇంటి ముందు నేతలు నిరసన వ్యక్తం చేశారు.
![BJP state executive member Suryanarayana arrested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-03-11-bjp-arest-av-ts10123_11092020124004_1109f_1599808204_616.jpg)
అధికారంలో లేనప్పుడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలన్న సీఎం కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఎందుకు నిర్వహించడం లేదని సూర్యనారాయణ ప్రశ్నించారు. నిజామాబాద్లో పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023లో భాజపా అధికారంలోకి రాగానే.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ఇల్లెందుల ప్రభాకర్, బైకన్ మధు, విజయ్ కృష్ణ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. పార్లమెంటులో పోరాటమే: సీఎం కేసీర్