ETV Bharat / state

ఎన్నికల కోడ్​ ఉల్లంఘించినా పోలీసులు పట్టించుకోవట్లేదు: బస్వా నర్సయ్య

నిజామాబాద్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న పోలింగ్ కేంద్రం సమీపంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్లు, తెరాస కార్యకర్తలు ఉన్నారని భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా పోలీసులు పట్టించుకోకుండా ఉండటంపై జిల్లా అధ్యక్షుడు బస్వా నర్సయ్య ఆగ్రహించారు.

ఎన్నికల కోడ్​ ఉల్లంఘించిన పోలీసులు పట్టించుకోవట్లేదు: బస్వా నర్సయ్య

author img

By

Published : Oct 9, 2020, 4:58 PM IST

నిజామాబాద్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద భాజపా ఎంపీ అర్వింద్, నగర పాలక సంస్థ కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్లు, తెరాస కార్యకర్తలు ఉన్నారంటూ భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసించారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా పోలీసులు పట్టించుకోవడం లేదని జిల్లా అధ్యక్షుడు బస్వా నర్సయ్య ఆగ్రహించారు. పోలీసుల తీరు సరిగాలేదంటూ పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసిన మంత్రి వేముల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.