ETV Bharat / state

'భూములు కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి' - నిజామాబాద్​ వార్తలు

నిజామాబాద్​ పట్టణంలోని నందిగుట్ట శివాలయానికి సంబంధించిన భూములను కొందరు కబ్జా చేస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

bjp leaders protest on occupation of lands in nizamabad district
'భూములు కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Feb 9, 2020, 4:49 PM IST

అక్రమంగా ఆలయ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని నందిగుట్ట శివాలయ దేవస్థాన భూములను కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. దేవస్థానం ఆధీనంలో ఉన్న 24 ఎకరాల భూమిలో ఇప్పుడు కేవలం 7 ఎకరాలు మాత్రమే రికార్డులో ఉండటం చాలా దారుణమన్నారు.

పవిత్రమైన దేవస్థానం చుట్టుపక్కల ఉన్న గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని... లేకుంటే భాజపా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

'భూములు కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి'

ఇవీ చూడండి: కేరళలో ఈనాడు నిర్మించిన ఇళ్లను పరిశీలించిన సంస్థ ఎండీ కిరణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.