నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎదుట భాజపా కార్పొరేటర్లు నిరసనకు దిగారు. జూమ్ యాప్ ద్వారా నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ఖాళీగా ఉన్న ఐదు కోఆప్షన్ సభ్యుల స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి అవకాశం లేకుండా తెరాస నేతలు అనైతికంగా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగేలా చూస్తున్నారని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసిస్తున్నారు.
నలుగురు కార్పొరేటర్లను...
భాజపా నుంచి నలుగురు కార్పొరేటర్లను తెరాసలో చేర్చుకుని.. ఎంఐఎంతో కలిసి కో ఆప్షన్ సభ్యులను తెరాస కైవసం చేసుకోవడంపై భాజపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస అప్రజస్వామిక తీరును తీవ్రంగా ఖండించారు. కో ఆప్షన్ సభ్యులను గెలుచుకునే అవకాశం భాజపాకు లేకుండా చేశారని నగర పాలక సంస్థ భాజపా ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి మండిపడ్డారు.
ఇవీ చూడండి : ప్రగతి భవన్ ముట్టడికి బయలు దేరిన విపక్షనేతల అరెస్ట్