నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాకాసిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. శుభ్రమైన నీటిలో కూడా వైరస్లు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. డెంగీ నిర్ధరణకు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: జనగామ ఆరోగ్యకేంద్ర రికార్డు.. ఒకే రోజు 16 సుఖప్రసవాలు