నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్‌పూర్ శివారులోని నీటి శుద్ధి ప్లాంటు వద్ద మిషన్ భగీరథ నీటిపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు గ్రామ కార్యదర్శులు, మండల అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మిషన్ భగీరథ నీటిపై ప్రజల్లో ఉన్న అపోహాలు తొలిగించాలని అధికారులు సూచించారు.
గ్రామాల్లో గల ఆర్వో ప్లాంట్ల నీటి కన్నా మిషన్ భగీరథ నీరు ఎంతో మంచిదని వివరించారు. ఆర్వో ప్లాంటు నీరు రెండు రోజులు నిల్వ ఉంటే బ్యాక్టీరియా చేరుతుందని... మిషన్ భగీరథ నీటిలో అలాంటి హాని ఉండదన్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులను వారానికి ఒక్క రోజు కడిగి శుభ్రం చేయాలన్నారు. నీటిపై ల్యాబ్‌లో ఎప్పటికప్పుడు పరీక్షలు జరుగుతాయన్నారు. లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు రోగాలబారిన పడకుండా ఉంటారని తెలిపారు.
ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'