నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రోడ్డు రవాణా భద్రత బిల్లును లోక్సభలో తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. నగరంలోని బస్టాండ్ ఎదుట ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ పెట్టుబడిదారుల సేవలో తరిస్తూ కార్మికులను విస్మరిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్ ఆరోపించారు.
ఇదీ చదవండిః తెరాస నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం