పీఆర్సీ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను విస్మరించిందని సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఆశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని ఆమె విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ నివేదికలో ఆశా వర్కర్ల ప్రస్తావనే లేదని నూర్జహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీఆర్సీలో ఆశాలను భాగస్వామ్యం చేసి.. కనీస వేతనం అందించాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పోరాటాలకు ఆశాలు సిద్ధం అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీహెచ్ నర్సయ్య, పెద్ది సూరి, సుకన్య, రేణుక, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Santhosh babu Family : గుండెల్లో బాధ కన్నా.. గర్వమే ఎక్కువ..