నిజామాబాద్ జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాలు వినూత్నంగా నిర్వహించారు.
యముడి రూపంలో..
చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. ట్రాఫిక్ నియమాలు పాటించని వాహన దారులకు యముడి రూపంలో పూలదండ వేసి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించిన వారికి పువ్వులను ఇచ్చి సత్కరించారు. జీవితం చాలా విలువైనదని తెలుపుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే వాహనదారులు తమకు ఓ కుటుంబం ఉన్నదనేది మరచిపోవద్దన్నారు.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో మరో లాజిస్టిక్ పార్కు సిద్ధం