ETV Bharat / state

ఆర్మూర్​లో సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - NIZAMABAD DISTRICT

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో వలస కూలీలకు, నిరుపేదలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు నిత్యావసర సరుకులు అందించారు.

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : May 1, 2020, 1:18 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వలస కూలీలకు, నిరుపేదలకు 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి, ఆయా వార్డుల్లోని పేదలకు సరుకులు అందించారు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం 'జీవన్ అన్న ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత నాలుగు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. 44వ జాతీయ రహదారి వెంట వెళ్లే ఇతర రాష్ట్రాల వలస కూలీలకు భోజన సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేశారు.

లాక్​డౌన్ కారణంగా గత నెల రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. విలువైన సేవలు అందిస్తున్నందుకు పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య, పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి : 'వుహాన్​ ల్యాబ్​ నుంచే కరోనా- ఆధారాలున్నాయ్!​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.