మహిళలను గౌరవించని సంస్కృతి భాజపాలో ఉందని నిజామాబాద్ జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు మల్యాల గోవర్ధన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్త హత్యకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఘటనను ఖండిస్తూ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు.
హాథ్రస్ ఘటన మరవకముందే, గుడికి వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తపై... అర్చకుడు అతని సహాయకుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వ హయంలో మహిళలకు రక్షణ లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నిహారిక కొత్త వెబ్ సిరీస్.. 'మాస్టర్' టీమ్ డ్యాన్సులు