ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో ఇద్దరు సీఐలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు..కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగదీష్ అవినీతికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో సోదాలు చేస్తున్నట్లు డీఎస్పీ ఆనంద్ తెలిపారు.
ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించగా.. మరికొన్ని ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం బాన్సువాడ రూరల్ సీఐ టాటా బాబు, ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ సీఐ పల్లె రమేష్ లు.. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాజాగా కామారెడ్డి పట్టణ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుండటంతో ఆ శాఖలో కలకలం రేపుతోంది.
ఇవీ చదవండి: 'మీ అమ్మాయికి స్కూలులో ప్రవేశం లేదు.. తీసుకెళ్లిపోండి'