నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ధర్మారం బి గ్రామంలోని సమాధుల తోటలో ఆత్మల పండుగను ఘనంగా నిర్వహించారు. పునీత లుర్దు మాత క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. మరణించిన తమ పెద్దల స్మారకార్థం నిర్మించిన సమాధులను రంగులు, పూలతో అందంగా అలంకరించారు.
కొవ్వొత్తులను వెలిగించి పెద్దలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన జ్ఞాపకార్థ కూడిక సమావేశంలో సందేశం వినిపించారు. లోకం విడిచిన పెద్దలను స్మరించుకునేందుకు ఏటా సమాధుల పండుగను నిర్వహిస్తున్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు.