కార్మిక సమస్యలు పరిష్కరించి.. లాక్డౌన్ ఉపాధి కోల్పోయిన కార్మిక వర్గాన్ని ఆదుకోవాలంటూ జూలై 3న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఓమయ్య కోరారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం.. విదేశీ ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కార్మికులని ఉపాధి, ఉద్యోగ అవకాశాల్ని ధ్వంసం చేస్తున్నటువంటి నిర్ణయాలని, విధానాలను ప్రధాని మోదీ విరమించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబానికి ప్రతినెల 7500 రూపాయలు ఆరు నెలలపాటు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అదేవిధంగా వలస కార్మికులు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి వాళ్లందర్నీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 59 చైనా యాప్‌లపై నిషేధం