నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఏఐటీసీయూ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ పౌరసరఫరాల సంస్థ హమాలీలు, స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హమాలీల కూలీ రేట్లను పెంచాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఒమయ్య కోరారు.
తమ సమస్యలపై గతంలో ఆందోళన చేశామని... రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్, ఛైర్మన్ ఇచ్చిన హామీ నేటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'మహబూబ్నగర్ జిల్లా అనేక రంగాల్లో పురోగతి సాధిస్తోంది'