కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, జాతీయ విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఏఐకేఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. అన్నదాతలను నట్టేట ముంచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవన్లో అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
విద్యుత్ బిల్లుతో రైతులపై భారం మోపే చర్యలు కేంద్రం చేపడుతోంది. బిల్లులు రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఇరవై రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడం అమానుషం. సమస్యల పరిష్కారానికి భవిష్యత్లో ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి.
-ప్రభాకర్, ఏఐకేఎమ్ఎస్ నాయకులు