రోడ్డు భద్రత అనేది నిత్య జీవితంలో భాగం కావాలని... నిజామాబాద్ అదనపు కమిషనర్ అరవింద్ బాబు అన్నారు. సమాజ భద్రత, కుటుంబ భద్రత మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
పరిమితికి మించి ప్రయాణికులతో వాహనం నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని సూచించారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్డ్ ధరించి నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏమి చేయదా?