ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివాసీ సంఘం సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ఆదివాసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి హాజరై కుమురంభీం ఆసిఫాబాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నాయక్‌పోడ్ వారు ఎస్టీ జాబితాలో వచ్చినా సరైన గుర్తింపు లేదని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. యువకులు బాగా చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని విఠల్ రెడ్డి సూచించారు.
ఇదీ చదవండిః సీడబ్ల్యూసీ లైవ్: కాంగ్రెస్‌కు కొత్త సారథి ఎవరో?