ETV Bharat / state

భైంసా బాధితులకు అండగా మేముంటాం : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

author img

By

Published : Feb 16, 2020, 8:13 PM IST

నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల ఘటనకు సంబంధించి బాధితులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి పరామర్శించారు. అనంతరం పట్టణంలోని కొర్వా గల్లీలో బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అదుకుంటామని... కాలిపోయిన అన్ని రకాల పత్రాలను ఇప్పిస్తామని వెల్లడించారు. భైంసాలో మత సామరస్యం పరిఢవిల్లాలని ఆకాక్షించారు.

అల్లర్లపై  జిల్లా కలెక్టర్​తో సమీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నిర్మల్‌ జిల్లా భైంసాలో భాజపా నేతల బృందం పర్యటించింది. భైంసా అల్లర్లపై స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో జిల్లా కలెక్టర్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్‌ రాజుతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సమీక్షించారు. అనంతరం కోర్వా గల్లీలో అల్లర్లలో దగ్ధమైన ఇళ్లను, జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బాధితులను ఓదార్చి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాలిపోయిన విద్యార్థుల పత్రాలను, వస్త్రాలను, రైతుల పట్టా పాసు పుస్తకాలను, ఇంటి పేపర్లను ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.

'మూడు నెలల వేతనం మీకోసమే'

మంత్రి కిషన్ రెడ్డి తన మూడు నెలల వేతనాన్ని బాధితులకు విరాళంగా ప్రకటించారు. పార్టీ పరంగా లక్ష్మణ్ రూ.10లక్షలు, ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్​ చెరో రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఎంఐఎంను తెరాస పెంచిపోషిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

భైంసా అల్లర్ల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. కేంద్ర నిఘా దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపురావు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు.

ఇవీ చూడండి : ప్రైవేటు బండి వస్తోంది... రెగ్యులర్ బండి పక్కకు​ జరపండి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.