నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం భైంసా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో భైంసా, కుబీర్, కుంటాల మండలాల నుంచి యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాబ్ మేళాలో పాల్గొన్న యువకుల దరఖాస్తులను పరిశీలించి.. ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేస్తారని ఎస్పీ పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ కూడా ఇస్తారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారి బంగారు భవితకు బాటలు వేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన