నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద నిర్మిస్తోన్న సదర్మాట్ బ్యారేజీ భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా గంటపాటు గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు.
మూడేళ్ల క్రితం బ్యారేజీ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు వాపోయారు. అధికారులకు, నాయకులకు పరిహారం విషయంలో గోడు వెళ్లబోసుకున్నా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పనులు వదిలేసి ఇక్కడే మకాం వేశామని పేర్కొన్నారు. పరిహారం చెల్లించాకే బ్యారేజీ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పెచ్చులూడిన అసెంబ్లీ పాత భవనం మొదటి అంతస్తు