నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయం సమీపంలోని దుకాణాలకు వార్షిక టెండర్లను ఆహ్వానించారు. దీని ద్వారా రూ. 2,87,66,079 ఆదాయం సమకూరినట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు.
చీరల దుకాణానికి రూ. 66 లక్షలు, పూజ సామగ్రి దుకాణాలకు లక్ష మూడు వేలు. ఫొటోల దుకాణం రూ.48 లక్షలు, చరవాణులు, సామగ్రి భద్రపరిచే గదికి రూ.26 లక్షలు, కొబ్బరి బోండాల దుకాణానికి రూ.19 లక్షలు, శివాలయం దగ్గర పూల కౌంటర్ కోసం రూ.15 లక్షలు, మరో దుకాణం రూ.13 లక్షలకు దక్కించుకున్నారు.
మిగిలిన వాటికి శని, ఆదివారాల్లో టెండర్లు ఆహ్వానిస్తామని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ శరత్పాఠక్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఆ సీత అడవులకెళితే.. ఈ బేబీ చీకటిలో మగ్గింది!