ETV Bharat / state

'నాది టార్చిలైట్​ గుర్తు అయితే బ్రష్​ గుర్తు ముద్రించారు'

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న సహకార ఎన్నికల పోలింగ్​లో ఒక గుర్తుకు బదులు మరో గుర్తును ఏర్పాటు చేశారు. దీనివల్ల గంటపాటు పోలింగ్​కు అంతరాయం కలిగింది.

symbol printing mistake in nirmal pacs elections
'నాది టార్చిలైట్​ గుర్తు అయితే బ్రష్​ గుర్తు ముద్రించారు'
author img

By

Published : Feb 15, 2020, 12:55 PM IST

'నాది టార్చిలైట్​ గుర్తు అయితే బ్రష్​ గుర్తు ముద్రించారు'

నిర్మల్​ జిల్లా సోన్​ మండలం న్యూ వెల్మల్​ గ్రామంలోని 3వ వార్డు నుంచి బొల్లి మహేందర్​ సహకార ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు మహేందర్​కు టార్చి లైట్​ గుర్తు కేటాయించారు.

జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోలింగ్​ కేంద్రంలో ​ టార్చిలైట్​ గుర్తు బదులు బ్రష్​ గుర్తు ప్రింట్​ చేశారు. పోలింగ్​ ప్రారంభమైన గంట తర్వాత అభ్యర్థి ఈ విషయాన్ని గమనించారు. వెంటనే ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లగా... బ్రష్​ గుర్తును చెరిపివేసి అభ్యర్థికి కేటాయించిన టార్చిలైట్​ గుర్తును ఏర్పాటు చేశారు. దీనివల్ల సుమారు గంటపాటు పోలింగ్​కు అంతరాయం కలిగింది.

బ్యాలెట్​ పేపర్​లు సరిగ్గానే ముద్రించామని, గుర్తులు మాత్రం తప్పుగా ప్రింట్​ అయ్యాయని ఎన్నికల అధికారి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.