ETV Bharat / state

నిర్మల్​లో ఘనంగా లింగ పున:ప్రతిష్టాపన ఉత్సవాలు - minister indrakaran reddy

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో.. లింగ పున:ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. వేద మంత్రాల నడుమ.. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. హరహర మహాదేవ శంభోశంకరా అంటూ భక్తులందరూ పారవశ్యంతో మునిగిపోయారు.

Shivalinga restoration ceremonies in Nirmal

author img

By

Published : Dec 27, 2020, 5:21 PM IST

నిర్మల్ జిల్లా బుధవార్​పేట్​లోని శివాలయంలో లింగ పున:ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు.. మంత్రోచ్ఛారణల నడుమ శివలింగానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు.

జిల్లా కేంద్రం పరిధిలోని పురాతన శివకోటి ఆలయం శిథిలావస్తకు చేరుకుంది. ఆ మేరకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంజూరు చేసిన రూ. 50 లక్షలతో, నిర్వాహకులు నూతన ఆలయాన్ని నిర్మించారు. సోమవారం నాడు శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్యుల చేతులు మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: రంగనాథస్వామి ఆలయం.. ఆసియాలోనే అతిపెద్ద గోపురం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.