ETV Bharat / state

Indrakaran Reddy: నిర్మల్‌లో సైన్స్‌ సెంటర్‌, ప్లానెటోరియం - ఇంద్రకరణ్ రెడ్డి తాజా వార్తలు

Indrakaran Reddy: నిర్మల్‌లో సైన్స్‌ సెంటర్‌, ప్లానెటోరియం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించామని.. కేంద్రం ఆమోదించగానే పనులు ప్రారంభిస్తామన్నారు.

Indrakaran Reddy
Indrakaran Reddy
author img

By

Published : May 27, 2022, 8:31 AM IST

Indrakaran Reddy: నిర్మల్‌లో రూ.42.41 కోట్లతో సైన్స్‌ సెంటర్‌, ప్లానెటోరియం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించామని, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ శాస్త్ర, సాంకేతిక మండలి సాధించిన విజయాలు, ప్రగతిపై మంత్రి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘విద్యార్థుల్ని శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వినూత్నంగా ఏడు ప్రాజెక్టులను రూ.14.51 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నాం. వాటిలో వరంగల్‌లోని రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌(ఆర్‌ఎస్‌సీ)లో ఇన్నోవేషన్‌ హబ్‌, విశ్వవిద్యాలయాలు/పరిశోధన సంస్థల్లో ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ కింద స్కిల్‌ డెవలప్‌మెంట్‌, వరంగల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఎస్‌-ఎస్‌టీ సెల్‌ వంటివి ఉన్నాయి. త్వరలో వరంగల్‌ సైన్స్‌ సెంటర్‌లో టీఎస్‌ కాస్ట్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏర్పాటు చేస్తాం’అని వివరించారు. ‘రూ 2.88 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 8 విశ్వవిద్యాలయాల్లో పేటెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌(పీఐసీ)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చదవండి:రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తా..: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.