నిర్మల్ జిల్లా ముధోల్కి చెందిన సవిత అనే వైద్యురాలు రెండేళ్ల క్రితం మరణించింది. ఆమె జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ, మిషన్ ముధోల్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సవిత మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ విద్యార్థి చదువులకు రూ.15 వేలు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమానికి హాజరైన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రక్తదానం మహాదానం అని అన్నారు.
ఇదీ చూడండి :సోదరుని విగ్రహానికి రాఖీ కట్టిన సోదరీమణులు