సత్యసాయి సేవాసమితి సేవా కార్యక్రమాల వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రసూతి వైద్యురాలు రజిని పేర్కొన్నారు. సత్యసాయి జయంతి సందర్భంగా సమితి నిర్వాహకులు ఆస్పత్రిలో బాలింతలకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సమితి ఆధ్వర్యంలో మూడేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని వైద్యురాలు తెలిపారు. ప్రతి ఏటా గ్రామాల్లో పేదవారికి సమితి చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు.