నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వివేకానంద హై స్కూల్ యాజమాన్యం చేసిన తప్పిదం పదో తరగతి విద్యార్థులకు శాపంగా మారింది. పదో తరగతి పరీక్షల్లో తెలుగు పేపర్ 2 కు బదులు సంసృతం సబ్జెక్టు పేపర్ ఇచ్చారు. విద్యార్థులు అక్కడి ఇన్విజిలేటర్ల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. సదరు సబ్జెక్టును స్కూల్ యాజమాన్యం ఆన్లైన్లో ఎంపిక చేసుకుందని తెలిపారు. ఫలితంగా విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.
భవిష్యత్తు అగమ్యగోచరం...
తెలుగు పేపర్ 2లో 60 మార్కులు ఉంటాయి. సంసృతం సబ్జెక్ట్‌కు 20 మార్కులే ఉంటాయి. అవగాహన లేని సబ్జెక్ట్ ఎలా రాయాలని స్కూల్ యాజమాన్యాన్ని అడిగినా... వారి నుంచి సరైన స్పందన లేదు. వివేకానంద హై స్కూల్‌కు చెందిన 35 మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. వెంటనే తమ పిల్లలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్ల భవిష్యత్ నాశనం చేశారంటూ ఆవేదన చెందుతున్నారు.