బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు కోరారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని ఆయన సూచించారు. జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మున్సిపల్ సిబ్బందితో ప్రయాణ ప్రాంగణంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రయాణ ప్రాంగణం, డిపోలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శానిటైజేషన్ చేయిస్తున్నట్టు ఆంజనేయులు వెల్లడించారు.