ETV Bharat / state

నిరాడంబరంగా రంజాన్ వేడుకలు.. ఎస్పీ శుభాకాంక్షలు - telangana news

లాక్​డౌన్ వేళ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లింలు నిరాడంబరంగా జరుపుకున్నారు. సామూహిక ప్రార్థన మందిరాలకు అనుమతులు లేకపోవడం వల్ల ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకున్నారు. స్థానిక మసీదును సందర్శించిన ఎస్పీ... రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ramdhan celebrations, nirmal sp in masjid
మసీదును సందర్శించిన ఇంఛార్జీ ఎస్సీ, నిర్మల్​లో రంజాన్ వేడుకలు
author img

By

Published : May 14, 2021, 10:39 AM IST

కరోనా నేపథ్యంలో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ముస్లింలు శుక్రవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. నెల రోజులుగా చేపట్టిన ఉపవాస దీక్షలు గురువారంతో ముగిశాయి. నెలవంక దర్శనం అనంతరం రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. లాక్​డౌన్ కారణంగా సామూహిక ప్రార్థనలకు అనుమతి లేకపోవడం వల్ల ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకున్నారు.

స్థానిక గుల్జార్ మార్కెట్ మసీద్​ను ఇంఛార్జీ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తౌహిరొద్దిన్ రఫ్ఫూ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అజహర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రంజాన్ స్పెషల్: విజ్ఞతతో వినమ్రతతో అల్లాహు అక్బర్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.