రామజన్మభూమి అయోధ్యకు 613 కిలోల గంటను తీసుకెళ్తున్న తమిళనాడుకు చెందిన రాజ్యలక్షి శనివారం రాత్రి నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. జిల్లా ముఖద్వారామైన సోన్ గోదావరి వద్ద భాజపా నాయకులు, భక్తులు స్వాగతం పలికారు. కడ్తాల్ గ్రామంలో రామాలయం వద్ద మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి సీతారాముల విగ్రహాలను, గంటను దర్శించుకున్నారు.
ఆదివారం ఉదయం పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశం నుంచి 615 కిలోల గంటను తయారు చేయించి రామ మందిరానికి తీసుకెళ్లడం తన పూర్వజన్మ సుకృతమని రాజ్యలక్ష్మి అన్నారు. దారి పొడవునా గ్రామాల్లో రామ భక్తులు నుంచి వస్తున్న స్పందన ఏంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. స్వయంగా తానే వాహనాన్ని నడిపి 10 రాష్ట్రాల మీదుగా 4,552 కిలోమీటర్లు ప్రయాణించి... అక్టోబరు 7న అయోధ్యకు చేరుకోనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రకృతి వనాలతో.. పల్లెలకు కొత్త కళ