జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.2లక్షల కోట్లు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని కోరుతూ.. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఉపాధి హామీ కూలీలకు ఏడాదిలో 200 రోజులు పని కల్పిస్తూ.. రూ. 600 కూలీగా చెల్లించాలని తిరుపతి కోరారు. పేదలు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలన్న ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: తుపాకీతో హెడ్‌కానిస్టేబుల్ హల్ చల్