నిర్మల్ జిల్లా డ్యాంగాపూర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. పోలీసులపై ప్రజల్లో మంచి అభిప్రాయం కూడ గట్టేందుకు గ్రామాల్లో సోదాలు చేశామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక బొలెరో వాహనంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిలువ ఉంచిన ఐదు వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీలు అనగానే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ శశిధర్ రాజు గ్రామస్థులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై అసాంఘిక కార్యకలాపాలను అదుపులోకి తేవడానికే ఈ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ తనిఖీల్లో ఏఎస్పీ, డీఎస్పీతో పాటు నలుగురు సీఐలు, 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ