నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డీ(కె) గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి తమ గ్రామంపై ఎక్కువ ప్రభావం చూపకూడదని గత సంవత్సరం గ్రామ దేవతలకు మొక్కుకున్న మహిళలు తమ మొక్కులను తీర్చుకున్నారు.
మహిళలంతా కలిసి కట్టుగా అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైరస్ నుంచి తమను కాపాడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.