నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయంలో పేదల ఆందోళన రెండో రోజుకు చేరింది. సంబంధిత అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదిలేదని తేల్చి చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి మున్సిపల్ సిబ్బందిని విధులకు రాకుండా అడ్డుకుంటున్నారు.
కుబీర్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు పోవడం వల్ల ఇళ్లు కట్టిస్తామని నాయకులు హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. అప్పటినుంచి అద్దెకు వుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ ఇళ్లు కట్టించలేదని వాపోయారు. అధికారులు, నాయకులు స్పందించి రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బురుడు గల్లీకి చెందిన పేదలు మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. వారికి ఇచ్చిన నకిలీ ఇళ్ల పట్టాలను చూపిస్తూ నిరసన తెలిపారు.
సంబంధిత అధికారులు హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని... మున్సిపల్ అధికారుల విధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం నుంచి ధర్నా చేస్తున్నా ఎవరూ తమ దగ్గరకు రాలేదని... హామీ ఇచ్చే వరకు అక్కడే ఉంటామని బాధితులు తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: రామతీర్థానికి రాములోరు.. కొత్త విగ్రహాల తయారీ పూర్తి