నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ పోలీస్ స్టేషన్ సమీపంలోని విద్యుత్ స్తంభం మధ్య ఓ ఎద్దుకు ఆహారం కనిపించింది. ఎలాగైనా ఆకలి తీర్చుకోవాలని ఆ స్తంభం మధ్య తల దూర్చింది. తిన్న తర్వాత వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించగా అందులో ఇరుక్కుపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ.. ఎద్దు పరిస్థితి గమనించి దాని తల బయటకు తీయడానికి యత్నించారు. స్థానికుల సహాయంతో ఆ మూగజీవిని కాపాడారు.
ఇదీ చదవండి: TPCC Chief: రేవంత్, కోమటిరెడ్డి ప్రత్యేక మంతనాలు..!