బీసీ కులాల జాబితాలోకి 17 కులాల వారిని చేర్చడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ఓడ్ కులస్థులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అట్టడుగు జీవితాన్ని అనుభవిస్తున్న 17 కులాలను బీసీ జాబితాలో చేర్చడం చారిత్రాత్మక నిర్ణయమని మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు.
కొత్తగా బీసీల జాబితాలో చేర్చిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్