నిర్మల్ జిల్లా బాసర రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ప్రవేశాలకు... పరిపాలనాధికారి ప్రొఫెసర్ వై.రాజేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనర్ బి.కృష్ణ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో పొందిన యావరేజ్(జీపీఏ), గ్రేడ్‌లోని మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు.
జిల్లా పరిషత్, మున్సిపల్, నాన్-రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాముఖ్యత ఇవ్వాలనే లక్ష్యంతో... పదో తరగతి జీపీఏకు 0.4 డిప్రైవేషన్ స్కోర్ చేర్చనున్నట్టు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉండగా... 85%(1275) తెలంగాణ విద్యార్థులకు, 15%(225) సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయించారు. స్పోర్ట్స్ కోటా కింద 0.5% సీట్లు కేటాయించాల్సి ఉండగా... న్యాయస్థానంలో వివాదం కారణంగా ఆ కేటాయింపును నిలిపివేసినట్టు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇతర సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు 9573001992, 9703760686 చరవాణీ నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం (ఆన్‌లైన్): 16-09-2020
దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ (ఆన్‌లైన్): 06-10-2020
ఎంపిక జాబితా ప్రకటన (తాత్కాలిక తేదీ): 20-10-2020
మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.rgukt.ac.in, http://admissions.rgukt.ac.in చూడాలని అధికారులు తెలిపారు.