2019 సంవత్సరంలో మావోయిస్టులు ఒగ్గు సట్వాజి అతని భార్య ఇద్దరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు సట్వాజి దంపతులకు డబ్బుతో పాటు ఇంటిని ఇదివరకే అందజేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ చొరవతో... ప్రభుత్వ హామీ మేరకు ఐదెకరాల భూమిని ఇచ్చారు. అందుకు సంబంధించిన పట్టాపాసు పుస్తకాలను జిల్లా ఎస్పీ సట్వాజీ దంపతులకు అందజేశారు.
గతంలో లొంగిపోయిన మావోయిస్టుల మాదిరిగానే... ఇప్పుడు కూడా మావోయిస్టులు లొంగిపోతే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని నిర్మల్ జిల్లా ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు అడవి జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేష్, నిర్మల్ గ్రామీణ సీఐ వెంకటేష్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?