ETV Bharat / state

మహిళా పోలీసుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ : ఎస్పీ

author img

By

Published : Nov 27, 2020, 7:33 PM IST

పోలీసుశాఖలో మహిళ ఉద్యోగుల పాత్ర కీలకమని నిర్మల్​ జిల్లా ఇన్​ఛార్జ్​ ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు.

Nirmal Incharge SP meeting women police facing problems in duty
మహిళ పోలీసుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ : ఎస్పీ

మహిళ పోలీసుల సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల్​ జిల్లా ఇన్​ఛార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ వెల్లడించారు. పోలీసుశాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళ అధికారులతో జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అన్ని కార్యాలయాల్లో వారికి ప్రత్యేక వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక బస్సును బందోబస్తు సమయంలో ఏర్పాటు చేస్తామన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్​స్టేషన్లలో రిసెప్షన్​ వద్ద మహిళలకే విధులు అప్పగిస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్​ సభ్యులచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.రాంరెడ్డి, ఎస్సైలు వెంకట్​, అంజాద్​ పాషా, ఏటీవో కృష్ణ ఆంజనేయులు, పోలీసు కార్యాలయ అధికారిణి నరసమ్మ, మహిళ ఎస్సైలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:భాగ్యనగర పరిశుభ్రత.. ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.