దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న అకారణ దాడులను నిలిపివేయాలని ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్యులు నిరసన చేపట్టారు. దాడులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డా.చక్రధారి పాల్గొన్నారు. తాగిన మైకంలో కొందరు, ఆసుపత్రి బిల్లు చెల్లించకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మరికొందరు వైద్యులపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నారని డాక్టర్ చక్రధారి అన్నారు.
ఇలాంటి దాడులను ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అలాగే నేరస్తులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు డాక్టర్ దామెర రాములు, డాక్టర్ శభాష్ రావు, డా. స్వర్ణా రెడ్డి, డా. సంతోష్, డా. కృష్ణమోహన్ మహిపాల్, డా. కృష్ణంరాజు, డా. రవి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా