ETV Bharat / state

రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు: ఇంఛార్జి ఎస్పీ

నిర్మల్ జిల్లా భైంసాలో 144 సెక్షన్ ఇంకా అమలులోనే ఉంది. పట్టణంలో పరిస్థితి అదుపులో ఉందని ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

nirmal-district-incharge-sp-vishnu-s-warrier-about-bahinsa-present-situations
రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు: ఇంఛార్జి ఎస్పీ
author img

By

Published : Mar 10, 2021, 1:15 PM IST

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే గ్రూప్‌ అడ్మిన్‌లతో పాటు తప్పుడు పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భైంసా పట్టణంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

బయటి నుంచి వచ్చే వ్యక్తులెవరినీ పట్టణంలోకి అనుమతించడం లేదు. ప్రజాప్రతినిధులూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో 144 సెక్షన్‌ అమలు ఉండడం వల్ల వీధులు నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చదవండి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.