నిర్మల్ జిల్లా కేంద్రంలో పదో రోజు కొనసాగుతున్న లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు జిల్లా ఇన్ఛార్జీ ఎస్పీ ప్రవీణ్ కుమార్. అలాగే పోలీస్ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేయాలని విధుల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండచి బయటకు రాకూడదని ఇన్ఛార్జీ ఎస్పీ ప్రవీణ్ కుమార్ సూచించారు. సరైన కారణం లేకుండా వాహనాలపై బయట తిరుగుతూ కనబడితే... వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
sఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం