ETV Bharat / state

నిర్మల్​ జిల్లాలో హరితహారం పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్​ - నిర్మల్​ జిల్లా వార్తలు

జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్మల్​ జిల్లా పాలనాధికారి ముషారఫ్​ అలీ ఫారూఖీ ఆదేశించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.

nirmal district collector review on harithaharam programme
నిర్మల్​ జిల్లాలో హరితహారం పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్​
author img

By

Published : Jul 24, 2020, 8:09 PM IST

నిర్మల్ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్​ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో హరితహారం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అధికారులు సమన్వయంతో ఆరో విడత హరితహారంలో జిల్లా లక్ష్యం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.

ప్రతి రోజు శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను ఆన్​లైన్ లో పొందుపర్చాలని తెలిపారు. ఆగస్టు 10నాటికీ ప్రతి శాఖ లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుతాన్, ఏఎస్పీ రాంరెడ్డి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కిషన్, ఆర్డీవోలు ప్రసూనాంబ, రాజు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: వరినారుతో కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.