18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారుఖీ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఒక్కరు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేయలనే లక్ష్యంతో ప్రతీ ఏటా ఓటర్ల నమోదు జాబితా కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
ఓటరు జాబితా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను, సీనియర్ సిటిజన్లను కలెక్టర్ సన్మానించారు. నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారి హేమంత్ బొర్కడే, డీఆర్వో రమేష్ రాఠోడ్ తహసీల్దార్లు, బీయల్ఓలు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భారీ క్వారంటైన్ కేంద్రం నిర్మిస్తున్న చైనా