గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ప్రణిత తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులంతా సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 9,799 మంది రెగ్యులర్ విద్యార్థులు, 225 మంది పైవేటుగా పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షకుడు, డిపార్ట్ మెంటల్ అధికారిని నియమించామన్నారు. మొత్తం 535 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రం వద్ద గుంపులు ఉండొద్దని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులు మాస్కులు ధరించినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
ఇవీచూడండి: మాస్ కాపీయింగ్: పట్టుబడ్డ ఎనిమిది మంది