నిర్మల్ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.. అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిపాలన అనుమతులు పొందిన వాటికి స్థలాలను గుర్తించి, టెండరు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
ఇప్పటికే పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో మిషన్ భగీరథ తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలను చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, నోడల్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెరాస ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం: బండి