నిర్మల్ జిల్లాలో జాతీయ ఆహార భద్రత పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. జాతీయ ఆహార భద్రత పథకం అమలుపై కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి పత్తి, వరి, పప్పుదినుసులు, చిరుధాన్యాల పంటలకు వార్షిక ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. రైతులు లాభదాయక పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.
క్షేత్ర పర్యటనలకై కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేస్తున్నందున ఎరువులు, విత్తనాల పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ముథోల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ కుమార్, సంపత్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ