వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మవద్దని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే టీకా వేయించుకున్నారు.
నూటికి నూరు శాతం:
నేటి నుంచి మున్సిపల్, రెవెన్యూ, వైద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి టీకా పంపిణీ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ నూటికి నూరు శాతం సురక్షితమని.. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు వేల మంది టీకా తీసుకున్నారని తెలిపారు.
ఎలాంటి అపోహలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకా వేస్తున్నారని స్పష్టం చేశారు. ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో చేపడుతోన్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఇదీ చూడండి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ