ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ అన్నారు. ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో నిర్వహించారు.
వాహనదారులకు జీబ్రా లైన్ క్రాసింగ్ ఉపయోగాన్ని వివరించారు. చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి.. సరైన ధృవపత్రాలు, లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు చాక్లెట్లు అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై దయనంద్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పరేడ్ మైదానంలో ఆర్మీ స్వర్ణోత్సవ వేడుకలు